టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్‌కు గాను తదుపరి ఫ్లాష్ సేల్ తేదీ, సమయాలను తాజాగా ప్రకటించింది. అందులో భాగంగానే నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌కు గాను ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే జియో ఫోన్ 2 ను వినియోగదారులు జియో వెబ్‌సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను రూ.2,999 ధరకు విక్రయించనున్నారు. కాగా జియో ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ జియో ఫోన్ 2ను ప్రవేశపెట్టారు. గతంలో పలు మార్లు ఈ ఫోన్‌కు ఫ్లాష్ సేల్ నిర్వహించగా, అందుకు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అందుకనే ఎప్పటి కప్పుడు రిలయన్స్ ఈ ఫోన్‌ను ఫ్లాష్‌సేల్‌లో విక్రయిస్తూ వస్తోంది.
జియో ఫోన్ 2 ను ఇలా కొనుగోలు చేయవచ్చు…
1. జియో వెబ్‌సైట్‌లోకి ముందుగా లాగిన్ అవ్వాలి. అనంతరం జియో ఫోన్ 2 ను సెలెక్ట్ చేసుకోవాలి.
2. ఫోన్‌ను ఆర్డర్ చేసేముందు పిన్ కోడ్ ఎంటర్ చేసి చెకవుట్ చేయాలి.
3. పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి ముందుకు సాగాలి.
4. పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
5. రూ.2,999 పేమెంట్ చేశాక ఆర్డర్ కన్ఫర్మేషన్ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.
జియో ఫోన్లకు రూ.49, రూ.99, రూ.153, రూ.297, రూ.594 రీచార్జి ప్లాన్లను అందుబాటులో ఉంచారు.
* రూ.49 ప్లాన్‌లో 1జీబీ డేటా, 50 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. వాలిడిటీ 28 రోజులు.
* రూ.99 ప్లాన్‌లో 14 జీబీ డేటా వస్తుంది. రోజుకు 0.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. వాలిడిటీ 28 రోజులు.
* రూ.153 ప్లాన్‌లో 42 జీబీ డేటా వస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను వాడుకోవచ్చు. వాలిడిటీ 28 రోజులు.
* రూ.297 ప్లాన్‌లో 42 జీబీ డేటా వస్తుంది. రోజుకు 0.5 జీబీ డేటా వాడుకోవచ్చు. 28 రోజుల వాలిడిటీతో 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. వాలిడిటీ 84 రోజులు.
* రూ.594 ప్లాన్‌లో 84 జీబీ డేటా వస్తుంది. రోజుకు 0.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. 28 రోజుల వాలిడిటీతో 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. వాలిడిటీ 168 రోజులు.
పైన తెలిపిన ప్లాన్లంటిలోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందిస్తున్నారు.