తమిళ టెంపర్ టీజర్.. సేమ్ టూ సేమ్ దించేశారు..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా టెంపర్. వక్కతం వంశీ కథ అందించిన ఈ సినిమా పూరి ఈమధ్య కాలంలో కొట్టిన హిట్ అని చెప్పొచ్చు. ఇక వరుస మూస సినిమాలు చేస్తున్న తారక్ తన పంథా మార్చుకునేలా ప్రేరేపించిన సినిమా టెంపర్. ఈ సినిమా తెలుగులో హిట్ అవడంతో ఈ సినిమాను తమిళ, హింది భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

హిందిలో రణ్ వీర్ సింగ్ ఆల్రెడీ సింబాగా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు తమిళ టెంపర్ కు టైం వచ్చింది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ డైరక్షన్ లో అయోగ్య పేరుతో తమిళ టెంపర్ వస్తుంది. ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. సేమ్ తెలుగు సినిమాకు కాపీ పేస్ట్ లా ఈ టీజర్ ఉంది. అయితే సినిమా కంటెంట్ దెబ్బతినకుండా విశాల్ అండ్ టీం ప్రయత్నించినట్టు ఉంది. అదే హింది టెంపర్ మాత్రం దాన్ని కిచిడి చేశారు. అయినా అక్కడ రణ్ వీర్ సింగ్ క్రేజ్ తో ఆ సినిమా హిట్ కొట్టింది.

అయోగ్య సినిమాలో విశాల్ సరసన రాశి ఖన్నా నటిస్తుంది. సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ రిలీజ్ కానుందట. తమిళంలో వరుస హిట్లు కొడుతున్న విశాల్ కు ఈ అయోగ్య సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news