ఏపీ లో జాబ్ మేళా.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరపున ప్రభుత్వం మరో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ప్రముఖ TATA Zudio, Wheels Mart, Byjus, Randstad సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.9500 నుంచి రూ.20 వేల వరకు జీతం ఉంటుందని సర్కారు తెలిపింది.

ఏ కంపెనీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Wheels Mart: ఈ సంస్థలో 70 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9500 నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి.

Zudio: 20 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ తో కలిపి నెలకు రూ.10,800 జీతం..

Byjus: ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి.విజయనగరం, విశాఖ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Randstand: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి..

పూర్తీ వివరాలు..

అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29 ఉదయం 10 గంటలకు శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, బాలాజీ నగర్, కాకతీయ కల్యాణ మండపం ఎదురుగా, విజయనగరం చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది..

ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకొవాలి..