వెయిట్‌ లాస్‌ సలాడ్‌.. మొలకలతో ఇలా సింపుల్‌గా చేసేయండి..!

-

ఇప్పటికే అందరూ కొత్త ఆవకాయను రుచి చూసే ఉంటారు. మే నెల అంతా ఇలా పచ్చడి తిని తెగ వేడి చేసి ఉంటుంది. ఎంత డైట్‌లో ఉన్నా.. ఆవకాయ పచ్చడి చూస్తే నోరూరిపోతుంది. రెండు నెలలు బరువు పెరిగినా పర్వాలేదు అని అన్నం, పచ్చడి, పప్పు, నెయ్యి కాంబినేషన్‌తో బాగా లాగించేసుంటారు కాదా..! వానలు స్టాట్‌ అయ్యాయి.. ఇక బరువు తగ్గే ఆలోచనలో ఉంటే..ఇప్పుడు చెప్పుకోబోయే సలాడ్‌ మీకు బాగా హెల్ప్‌ అవుతుంది. మరీ ఈ వెయిట్‌ లాస్‌ సలడ్‌ ఎలా చేయాలో చూద్దామా.!

వెయిట్‌ లాస్‌ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మొలకొచ్చిన పెసలు అరకప్పు
మొలకొచ్చిన బొబ్బర్లు పావుకప్పు
వేపించిన నువ్వులు అరకప్పు
క్యారెట్‌ తురుము అరకప్పు
ఖర్జూరం ముక్కలు అరకప్పు
కిస్‌మిస్‌లో రెండు టేబుల్‌ స్పూన్స్
జీడిపప్పు రెండు టేబుల్‌ స్పూన్స్‌
పచ్చిమిర్చి ఒకటి
పుదీనా కొద్దిగా
లమెన్ జ్యూస్ ఒక టేబుల్‌ స్పూన్‌

తయారు చేసే విధానం..

మిక్సిజార్‌ తీసుకుని అందులో వేపించిన నువ్వులు వేసి గ్రైండ్‌ చేసుకోండి. పేస్ట్‌లా అవుతుంది. అది తీసి పక్కన పెట్టుకుని.. మళ్లీ మిక్సీజార్‌లో గింజ తీసిన ఖర్జూరం, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసి, నువ్వుల పేస్ట్‌ కూడా వేసి మళ్లీ గ్రైండ్‌ చేయండి. బౌల్‌ తీసుకుని మొలకొచ్చి పెసలు, బొబ్బర్లు, జీడిపప్పులు, కిస్‌మిస్‌లు, క్యారెట్‌ తురుము, పుదీనా వేసి కలిపేసి.. ముందుగా గ్రైండ్‌ చేసుకున్న నువ్వుల బటర్‌ కూడా వేయండి. బాగా మిక్స్‌ చేసుుకోండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా వెయిట్‌ లాస్‌కు కూడా చాలా హెల్ప్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news