యాక్సెంచర్ లో ఉద్యోగావకాశాలు..ఇలా అప్లై చెయ్యండి..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టెక్​ దిగ్గజం యాక్సెంచర్ ఉద్యోగావకాశాలని కల్పిస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. నోయిడా, చెన్నై లొకేషన్లలో కామర్స్​ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్​పై పరిజ్ఞానం వున్నా వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

jobs
jobs

 

మేనేజ్​మెంట్​ లెవల్ అనలిస్ట్​ (నోయిడా లొకేషన్​) కి అయితే కామర్స్​ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలానే సంబంధిత విభాగంలో కనీసం 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇది ఇలా ఉంటే తమ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్​, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో చెల్లింపుల నిర్వహణ కోసం వీరిని ఉపయోగించుకోనున్నట్లు పేర్కొంది. మేనేజ్​మెంట్ అనలిస్ట్​గా సమస్యలను విశ్లేషించి, పరిష్కరించాల్సి ఉంటుంది. అలానే మీ క్లయింట్లు లేదా యాక్సెంచర్ మేనేజ్‌మెంట్​లోని ఫైనాన్షియల్ టీమ్​తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి.​ కంపెనీ యాక్టివిటీస్​పై, కొత్త అసైన్‌మెంట్లపై వివరణాత్మక సూచనలు ఇవ్వడం, కంపెనీ వ్యాపార కార్యకలాపాలపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.

ఇక మేనేజ్​మెంట్​ లెవల్​ అసోసియేట్​– చెన్నై కి అయితే ఏదైనా కామర్స్​ సబ్జెక్ట్​లో బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. పే ప్రాసెసింగ్‌,- అకౌంట్స్ ప్రాసెసింగ్​పై అవగాహన కలిగి ఉండాలి. www.accenture.com/us-en/careers ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news