లా అసోసియేట్ ఉద్యోగాలు…. ఇలా అప్లై చెయ్యండి ..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్ర‌భుత్వం లా అసోసియేట్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేయచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఈ నోటిఫికేష‌న్ ఆధారంగా కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

30 ఏళ్ల లోపు ఉన్న లా చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకో వచ్చు. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 8, 2021 ఆఖరు తేదీ. కేవ‌లం ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇది ఇలా ఉంటే కేవలం వైవా వాయిస్ ద్వారానే ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.60,000 + రూ.15,000 ట్రాన్స్ పోర్టు అలవెన్స్ ఉంటుంది.

ఇక అర్హత విషయం లోకి వస్తే…. మూడు లేదా ఐదు సంవత్సరాల లా డిగ్రీ పాసై ఉండాలి. అదే విధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ లో నమోదై ఉండాలి. సంబంధిత రంగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పక ఉండాలి.అదే విధంగా అభ్య‌ర్థి ఎంపిక‌ను చీఫ్ సెక్ర‌ట‌రీ నామినేట్ చేసిన క‌మిటీ నిర్వ‌హిస్తోంది.
నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్  https://law.telangana.gov.in/home.do ను చూసి తెలుసుకోచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news