మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, JE, డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు కూడా అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు శాలరీ ఉంటుంది. అప్లై చేసుకోవడానికి నవంబర్ 12, 2021 లోగా అప్లై చేసుకోవాల్సి వుంది. ఇక అర్హత విషయంలోకి వస్తే.. దరఖాస్తు చేసుకోనే అభ్యర్థి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. అలానే అనుభవం కూడా తప్పనిసరి. అలానే దరఖాస్తు చేసుకొనే వారు తమ గత సంస్థ పేస్లిప్‌లను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్ www.gujaratmetrorail.com లో GMRC యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలని చూడచ్చు. పోస్టుల వివరాలలోకి వెళితే.. అసిస్టెంట్ మేనేజర్ (రోలింగ్ స్టాక్) 01, అసిస్టెంట్ మేనేజర్ (సిగ్నలింగ్) 02, అసిస్టెంట్ మేనేజర్ (L&E) 03, జాయింట్ జనరల్ మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M) 01.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M)) 01, మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M)) 02, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్/ట్రాక్ (O&M) 04, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) 03, సెక్షన్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) 02, అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) 04, జూనియర్ ఇంజనీర్ (సివిల్/ట్రాక్ (O&M)) 04, నిర్వహణ (సివిల్/ట్రాక్ (O&M)) 04.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.