నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగ అవకాశాలు వున్నాయి. దీనికి సమందించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నారు, గేట్ (GATE) స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జూన్ 10ని ఆఖరి తేదీ. ఈలోగా ఆసక్తి, అర్హత వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల నుంచి రూ. 1.40 లక్షల వరకు వేతనం వస్తుంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్.
పవర్ సిస్టమ్స్ & హై ఓల్టేజ్, మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్ తదితర విభాగాల్లో బీటెక్ పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులకు గరిష్ట వయస్సు 27 ఏళ్లు ఉండాలి. అలానే తప్పనిసరిగా గేట్ 2021 పరీక్షకు హాజరై ఉండాలి. ఆ పరీక్షలో సాధించిన స్కోర్, గ్రూప్ డిస్కషన్ లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలని ఈ లింక్ లో చూడండి https://www.ntpccareers.net/