పంజాబ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్‌ లోని సెంట్రల్‌ యూనివర్సిటీ లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పంజాబ్‌ లోని సెంట్రల్‌ యూనివర్సిటీ లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు వున్నాయి.

అలానే నాన్‌ టీచింగ్‌ పోస్టులు కూడా ఖాళీగా వున్నాయి. ఇక అర్హత వివరాలు చూస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఈడీ/ ఎంపీఈడీ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ప్లైయిడ్‌ అగ్రికల్చర్‌, బోటనీ, ఇంగ్లిష్‌, ఫైనాన్షియల్‌ అడ్మిన్‌, జియోగ్రఫీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇలా పోస్టు ని బట్టీ విద్యార్హత వుంది. యూజీసీ నెట్‌లో అర్హత పొంది ఉండాలి కూడా.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించకూడదు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 24, 2023 ఆఖరి తేదీ. ఈ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రూ.750లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలని http://cup.edu.in/teaching_jobs.php లో చూసి అప్లై చేసుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news