ధనుశ్ ‘సార్’ నుంచి బంజార సాంగ్‌..

-

ఇప్పుడు ధనుష్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించబోతున్నారు. ధనుష్ ఎన్నాళ్ల నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన ధనుష్ ఆతరువాత మారి, వీఐపీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం సార్..ఈ చిత్రంలో హీరోగా ధ‌నుశ్ న‌టించ‌గా.. హీరోయిన్ గా సంయుక్త మీనన్ అలరించనుంది.తమిళంలో ఈ సినిమాకి ‘వాతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సితార నాగవంశీ .. సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను రెండు భాషల్లోను ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘బంజారా’ అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఇల్లేనాదని .. వాకిలి నాదేనంటే ఫక్కున నవ్వుతాది భూ తల్లి’ అంటూ ఈ పాట మొదలవుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ మూవీలో ధ‌నుష్ జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. తెలుగు .. తమిళ భషాల్లో ఒకే రోజున విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news