మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో ఉన్న సిద్ధిపేట, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకి చెందిన ఈ విద్యా సంస్థల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులని డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. ఇక ఖాళీల వివరాల లోకి వెళితే.. ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ), టీజీటీ, స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు వున్నాయి.
ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథమేటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కౌన్సెలర్ విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి అని నోటిఫికేషన్ లో వుంది. వయస్సు వచ్చేసి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి వున్నవాళ్లు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడమే.
పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్, బీఏ/ బీఎస్‌స్సీ, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్/బీసీఏ/ఎంసీఏ/ఎమ్మెస్సీ, బీఈడీ, బీఎస్సీ/ డిప్లొమా నర్సింగ్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అదే విధంగా అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మార్చి 5, 8, 10 తేదీల్లో ఇంటర్వ్యూ ని నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం https://siddipet.kvs.ac.in/ ని చూడండి. ఇంటర్వ్యూలను నిర్వహించే చిరునామా: ఫస్ట్‌ఫ్లోర్, ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర, కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట.