ట్రంప్‌కు బైడెన్ షాక్ వెన‌క క‌థ ఇదే…!

-

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షపదవికి డొనాల్గ్ ట్రంప్ తో పోటి పడుతున్న ప్రత్యర్ధి జో బైడెన్ ఊహించని షాక్ ఇచ్చారు.  ట్రంప్ తో జరగాల్సిన ముఖాముఖి కార్యక్రమంలో తాను పాల్గనేది లేదని బైడెన్ స్పష్టంగా చెప్పారు. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడి మిలిటరీ ఆసుపత్రిలో చేరిన ట్రంప్ రెండు రోజుల  తర్వాత డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ కు కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేవని డాక్టర్లు ప్రకటించారు. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని  డాక్టర్లు ప్రకటించినా బైడెన్ మాత్రం దాన్ని నమ్మటం లేదు.

ఆసుపత్రి నుండి డిశ్చార్జి తర్వాత వైట్ హౌస్ కు ట్రంప్ చేరుకున్నారు.  ఈనెల 15వ తేదీన బైడెన్ తో జరిగే ముఖాముఖిలో పాల్గొనేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను నిరాకరిస్తున్నట్లు  బైడెన్ ఓ ప్రకటన చేశారు. కరోనా వైరస్ సమస్యతో ఇబ్బంది పడిన వ్యక్తితో ముఖాముఖిలో పాల్గొనేందుకు తన వైద్యులు అనుమతించలేదని డెమక్రటిక్ అభ్యర్ధి ప్రకటించారు.  క్లీవ్ ల్యాండ్ లోని తన వైద్యులు చెప్పినట్లే తాను నడుచుకుంటానని బైడెన్ చేసిన ప్రకటన అమెరికాలో సంచలనంగా మారింది.

ట్రంప్ తో చర్చలో పాల్గొనాలని తనకు ఆసక్తిగానే ఉన్నప్పటికీ వైద్యుల సూచన ప్రకారమే నిరాకరిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు. విషయం ఏమిటంటే ట్రంప్ తో పోటి పడుతున్న బైడెన్  వయస్సు కూడా  70 ఏళ్ళ పైనే. వైట్ హౌస్ సిబ్బందిలో ఇప్పటికే 20 మంది ఉద్యోగులకు వైరస్ సోకిన విషయం తెలిసిందే. వీళ్ళే కాకుండా మరో 10 మంది  ట్రంప్ వ్యక్తిగత సిబ్బందికి కూడా వైరస్ సోకటంతో అందరు ఐసొలేషన్ కేంద్రాల్లోకి వెళ్ళిపోయారు.

బహుశా ఈ విషయంలోనే బైడెన్ ట్రంప్ ఆరోగ్య పరిస్దితిని అనుమానిస్తున్నట్లు కనబడుతోంది. తాను వైరస్ భారిన పడకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే ట్రంప్‌తో చర్చలకు వెనకాడుతున్న విషయం అర్ధమైపోతోంది.

 

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news