కంగనాకు షాక్… ఆ ట్వీట్ మీద ఎఫ్ఐఆర్

-

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి కర్ణాటక కోర్టు షాకిచ్చింది. ఆమె మీద ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయాలని కర్నాటకలోని తుమకూరు కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. రైతు చట్టాలకు నిరసన తెలుపుతున్నవారిని ఆమె ఉగ్రవాదులుగా పోలుస్తూ గత నెల 21న ట్వీట్ చేసింది. ఈ చట్టాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేసినవారే ఈ చట్టాలను నిరసిస్తున్నారని ఆ ట్వీట్ లో కంగనా వ్యాఖ్యానించింది. అయితే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ న్యాయవాది రమేష్ నాయక్ తుమకూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌లో కంగనా ట్వీట్లను ప్రస్తావించారు. కంగనా చేసిన ట్వీట్లు రెండు వర్గాల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం,పోలీసులు కూడా ఈ ట్వీట్లను చూసీ చూడనట్లే వదిలేసినట్లు కనిపిస్తోందని, అందుకే సుమోటో కేసు కూడా నమోదు కాలేదని ఆయన పేర్కొన్న్నారు. ఇలాంటి కంటెంట్‌ను సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టింగ్‌కి అనుమతిస్తే… ఈ దేశంలో రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని దేశంలో హింసను రెచ్చగొట్టి అస్థిరత ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి వాళ్ల మీద సెక్షన్ 33,108,153,153A,504ల కింద కేసులు నమోదు చేయాలి.’ అని రమేష్ నాయక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాతసండ్రా పోలీసులని కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news