అమెరికా ఎన్నికల ఫలితాల్లో మళ్ళీ సీన్ మారింది. మ్యాజిక్ ఫిగర్ కు 17 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో జో బైడెన్ నిలిచారు. మిషిగన్ సహా పలు కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ గెలుపొందారు. అయితే మిషిగన్ ఫలితంపై స్థానిక కోర్టులో రిపబ్లిక్ అభ్యర్ధులు దావా వేశారు. ప్రస్తుతానికి జో బైడెన్ 253 ట్రంప్ కు 213 ఎలక్ట్రోరల్ ఓట్లు వచ్చాయి. అయితే అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిగా జో బైడెన్ రికార్డు సృష్టించారు ఇప్పటి దాకా జో బైడెన్ కు ఏడు కోట్ల 31 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయని తెలుస్తోంది. ఇక పెనిస్లేవియాలో కౌంటింగ్ కొనసాగుతోంది.
ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న 538 ఓట్లకు గాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడు అవుతారు. అయితే ఇప్పటి వరకు జో బైడెన్ కు 253 ఎలక్టోరల్ ఓట్లు లభించగా ట్రంప్ కు కేవలం 213 ఓట్లు లభించాయి. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ లో గెలిచే వాడే అధ్యక్ష పదవి చేపడతానని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే విస్కాన్సన్ లో జో బైడెన్ గెలిచారు. కానీ అక్కడి కౌంటింగ్ పై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని మళ్ళీ రీకౌంటింగ్ చేయాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఇక పెన్సిల్వేనియాలో ఉన్న ఇంకో పద్నాలుగు లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే పెన్సిల్వేనియాలో పది రెట్లు మెయిల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. కరోనా కారణంగానే మెయిల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని అంటున్నారు.