అమెరికాకు ప్రెసిడెంట్-ఎలెక్ట్ అయిన జో బిడెన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయన తన ఇంట్లో తన కుక్కలలో ఒకదానితో ఆడుతున్నప్పుడు అతని కాలు బెణికినట్టు సమాచారం. అయితే ఆయన ఎముకలు విరిగినట్లు ఏమీ కనిపించ లేదని బిడెన్ యొక్క వ్యక్తిగత వైద్యుడి ప్రకటన ఉటంకిస్తూ ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ సంఘటన శనివారం జరిగిందని అంటున్నారు. జోబిడెన్ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ కుక్కతో ఆడుకుంటుండగా జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో బిడెన్ డెలావేర్ లోని ఆర్థోపెడిక్ డాక్టరును కలిసి చికిత్స తీసుకున్నారని బిడెన్ కార్యాలయం వెల్లడించింది. ఇక జో బిడెన్ రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. అందులో 2018లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా జారి పడి గాయపడ్డారని అంటున్నారు.