జీవిత, రాజశేఖర్ 420 గాళ్ళు అని..వారు మహా నటులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యో స్టార్ గ్రూపు ఎండీ హేమా, కోటేశ్వరరాజు. జీవిత రాజశేఖర్ ఒక పెద్దా మహానటీ అని.. జీవిత రాజశేఖర్ మమ్మల్ని చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఎవరండి జీవితా రాజశేఖర్ పాతకాలపు ఓ సీనినటీ అని.. ప్రజలను అబద్ధాలతో పెద్దమనిషుల పేరుతో మోసం చేస్తున్నారన్నారు.
మొదట అసలు మేము ఎవరో కూడా తెలియదు అన్నారు… నిన్న మా గురించి మాట్లాడారు..పరువుగల కుటుంబం నుండి వచ్చామని తెలిపారు. లిమిట్స్ క్రాస్ చేసి మాగురించి మాట్లాడింది..జీవిత రాజశేఖర్ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు. కోర్టులో మేము విజయం సాధిస్తామన్నారు.
ఆధారాలతో సహా మేము కోర్టు సమర్పించామని.. సెలబ్రేటీ ఒక లైఫ్ … సామాన్యుడికి ఒక లైఫ్ ఉంటుందా అని నిలదీశారు. సెలబ్రేటి పేరుతో మోసాలు చేస్తోంది…జీవిత రాజశేఖర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు.