ఎన్టీఆర్ కి రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్

-

నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరి స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అంటే రామ్ చరణ్ కు ఎంతో ఇష్టం.. అదే సందర్భంలో ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ దోస్తీ పై ఎన్నో సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన స్నేహానికి ఎవరి దిష్టి తగలకూడదన్నాడు.

 

అయితే నేడు రామ్ చరణ్ పెట్టిన ట్వీట్ లో..” బ్రదర్, కోస్టార్ ఫ్రెండ్.. నువ్వు నాకు ఏంటో చెప్పడానికి నా దగ్గర పదాలు కూడా లేవు.. మన దగ్గర ఉన్న వాటిని నేను ఎప్పుడూ ఆనందంగా ఫీల్ అవుతాను” అంటూ.. రామ్ చరణ్ ఓ ట్వీట్ చేశాడు. అలాగే ఎన్టీఆర్ ని గట్టిగా హత్తుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు చరణ్. కాగా నెట్టింట్లో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రామ్ చరణ్ పెట్టిన ట్వీట్ పై ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ చరణ్ అన్న… జై ఎన్టీఆర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చరణ్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news