ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి వన్డేలో అంతగా ఆకట్టుకోకపోయినా రెండో వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తం 3 వికెట్లను తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో తాజాగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది.
అయితే రెండో వన్డేలో 8వ ఓవర్‌లో ఆర్చర్ అద్భుతమైన బాల్ వేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్కస్ స్టాయినిస్‌ను పవిలియన్‌కు పంపాడు. ఆర్చర్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని స్టాయినిస్ ఆడలేకపోయాడు. దీంతో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దాన్ని సులభంగా క్యాచ్ పట్టడంతో స్టాయినిస్ ఔటయ్యాడు. ఈ క్రమంలో అతను 14 బంతులే ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Unplayable 👀
Live clips: https://t.co/GcX9J1cxDm#ENGvAUS pic.twitter.com/xUNMcI2LIK
— England Cricket (@englandcricket) September 13, 2020
కాగా ఆర్చర్ తీసిన ఆ వికెట్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక 3 వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలిచిన తరుణంలో ఆఖరిదైన నిర్ణయాత్మక మ్యాచ్ మాంచెస్టర్‌లో బుధవారం జరగనుంది.