2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూలిపోతాడని చురకలు అంటించారు జోగి రమేష్. చంద్రబాబు ట్విట్ కు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షల ఇళ్ళకు రావటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పాలని కోరారు. జగనన్న కాలనీల నిర్మాణాలు ఎలా ఉన్నాయో చూడటానికి రావాలని ఛాలెంజ్ చేస్తున్నాను… నీ కొడుక్కి పనీ పాటా లేదు.. రోడ్ల మీద తిరుగుతున్నాడని ఫైర్ అయ్యారు.
14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా నీ పాలన, నాలుగేళ్ల పాలనలో జగన్ పాలన పై ఆలోచించాలి.. ప్రజలకు అంత మంచి చేస్తే 23 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యే వాడివి?? అన్నారు. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా నా ఛాలెంజ్ ను స్వీకరించాలి.. లోకేష్ పాదయాత్రకు వస్తానని పేర్కొన్నారు. ఏ జగనన్న కాలనీ అయినా.. ఓకే.. మీరు చెప్ఫినా ఓకే…నన్ను చెప్పమన్నా సరేనన్నారు. రాష్ట్రంలో కోటిన్నర గడపలకు వెళ్ళటానికి చంద్రబాబు, లోకేష్ సిద్ధమా?? 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూలిపోతాడని ఎద్దేవా చేశారు. జనం మెచ్చిన నాయకుడు జగన్ అయితే.. వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు జోగి రమేష్.