“ఈ పుట్టుక నాది…బ్రతుకంతా మీది” : జోగినిపల్లి సంతోష్ ఎమోషనల్

-

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నమ్మిన బంటు.. జోగినిపల్లి సంతోష్ కుమార్ గురించి తెలియని వారు ఉండరు. టిఆర్ఎస్ పార్టీ పురుడుపోసుకున్న 2001 సంవత్సరం నుంచి… సీఎం కేసీఆర్ వెనకే ఉండి… జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఎల్లవేళల సీఎం కేసీఆర్ కు సేవలందిస్తూ.. గుర్తింపు తెచ్చుకున్నారు జోగినిపల్లి సంతోష్ కుమార్. సీఎం కేసీఆర్ కు జోగినిపల్లి సంతోష్ కుమార్ వరుసకు కొడుకు అవుతాడు. ఊహ తెలిసినప్పటి నుంచి.. సీఎం కేసీఆర్ దగ్గరే సంతోష్ కుమార్ పెరిగి పెద్ద అయ్యారు.

ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుడిగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇది ఇలా ఉండగా ఇవాళ జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే… సీఎం కెసిఆర్ ను… తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు సంతోష్ కుమార్. ” ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది” అంటూ సీఎం కేసీఆర్ తో దిగిన చిన్నప్పటి ఫోటో ను జోగినిపల్లి సంతోష్ కుమార్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news