అమెరికా ఔషధ కంపెనీ జాన్సన్ & జాన్సన్ తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ వికటించింది..దీంతో మూడ దశ క్లినికల్ ట్రయల్స్‌ను సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది.. కరోనా వ్యాక్సిన్ తయారు చేయటంలో జాన్సన్ & జాన్సన్ కంపెనీ ముందుంది..మొదటి,రెండో దళ క్లినికల్ ట్రయల్ విజయవంతంగా పూర్తిచేసింది..తాజాగా మూడో దశ ట్రయల్ ప్రారంభించింది జాన్సన్ & జాన్సన్ కంపెనీ.. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్‌కు శరీరంలో ఒక్కసారిగా మార్పులు గుర్తించింది సంస్థ..క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో గుర్తించలేని అనారోగ్యం కారణంగా 3 దశ ట్రయల్స్‌తో సహా కోవిడ్ -19 వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సోమవారం రాత్రి జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటన విడుదలలో తెలిపింది..క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారి ఆరోగ్యంపై ప్రతేక దృష్టి పెట్టామని స్వతంత్ర డేటా భద్రత పర్యవేక్షణ బోర్డు (DSMB) మరియు అంతర్గత భద్రతా వైద్యులు సమీక్షిస్తున్నారని తెలిపింది..టీకా ట్రయల్ పాల్గొన్న వాలంటీర్లలో ఇటువంటి అనారోగ్యాలు సాధారణం అని కంపెనీ జాన్సన్ & జాన్సన్టీకా అని కంపెనీ తెలిపింది.
వికటించిన జాన్సన్ & జాన్సన్ కరోనా వ్యాక్సిన్..క్లినకల్ ట్రయల్స్ నిలివేత.
-