క‌రోనాపై సోష‌ల్ మీడియాలో చిత్ర‌మైన ప్ర‌చారం..!

-

క‌రోనా. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాణాంత‌క‌ వైర‌స్‌. ఈ వైర‌స్ విష‌యంలో కేంద్రం ప్ర‌బుత్వం, దీనికితోడుగా రాష్ట్ర ప్ర‌భుత్వాలుఅనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు చేతులు ఎత్తేశాయి. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ప్ర‌భుత్వాల చ‌ర్య‌ల విష‌యంలో ఆస‌క్తిక‌ర కామెంట్లు వెలుగు చూస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా టిక్‌-టాక్‌లో అయితే.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేలా కామెంట్లు వ‌స్తున్నాయి. దేశంలో 500 క‌రోనా పాజిటివ్ కేసులు రెండు మూడు మ‌ర‌ణాలు ఉన్న‌ప్పుడు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. రోడ్డు మీద‌కి వ‌చ్చిన వారిని చిత‌క‌బాదారు.

వాహ‌నాలు సీజ్ చేశారు. వేల‌కు వేలు ఫైన్ వేశారు. ఇక‌, దేశంలో 5000 కేసులు న‌మోదై.. రెండు వంద‌ల మంది మృతి చెందిన‌ప్పుడు ఇళ్ల‌లోనే ఉండి.. గ‌రిటెల‌తో ప‌ళ్లేల‌పై మోగించి వైద్యుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పాపం .. పిచ్చి జ‌నాలు అలానే చేశారు. ఇక‌, దేశంలో కేసులు ల‌క్ష దాటి.. మ‌ర‌ణాలు వెయ్యి దాటిన‌ప్పుడు గంట‌లు మోగించి.. ఇళ్ల‌లో దీపాలు పెట్ట‌మ‌ని పిలుపునిచ్చారు. అప్పుడు కూడా అలానే చేశారు. ఇక‌, దేశంలో కేసులు రెండు ల‌క్ష‌లు దాటిపోయి.. మ‌ర‌ణాలు రెండు వేలు దాటిపోయిన‌ప్పుడు ఆసుప‌త్రుల‌పై పూల వ‌ర్షం కురిపించారు.

విడ‌త‌ల వారీగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ.. వ‌చ్చారు. మ‌రి ఇంత చేసినా.. క‌రోనా ఎక్క‌డైనా త‌గ్గిందా? అంటే త‌గ్గ‌క పోగా.. పెరిగింది కూడా! ఇక‌, ఇప్పుడు దేశంలోమ‌ర‌ణాలు ఆరు వేలు.. కేసులు ఆరు ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మొత్తం లాకులు ఎత్తేశారు! మ‌రి ఇది దేనికి సంకేతం? అనేది సోష‌ల్ మీడియాలో కురుస్తున్న ప్ర‌శ్న‌ల వ‌ర్షం. దీనికి స‌మాధానం ఎవ‌రు చెబుతారు? ఏదేమైనా.. ప్ర‌భుత్వాల‌కు క‌రోనాపై ఎలాంటి అవ‌గాహ‌న లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్ర‌ధాన విమ‌ర్శ‌. మ‌రి దీనికి పాల‌కులు ఏం చెబుతారో చూడాలి. ఏదేమైనా.. మ‌న‌కు మ‌నమే జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news