దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా మరణాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. కరోనా శవాలను కొన్ని కొన్ని ఆస్పత్రులు దాచేస్తున్నాయి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సర్కార్ కరోనా మరణాల విషయంలో ఇప్పుడు అబద్దాలు ఆడుతుంది అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు మరణాలను బయటకు రానీయడం లేదని అంటున్నారు.
ఇక కేసులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నాయని వాటి వాస్తవాలు తెలుస్తాయి అనే కరోనా మరణాలను బయటకు రానీయడం లేదు అని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. శవాలు మాయం అవుతున్నాయి అంటూ సిఎంకి లేఖ రాసారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, హోమ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ఆరోగ్య సాఖ మంత్రి రాజేష్ తోపేకు బీజేపీ నేత కీరిత్ సోమయ్య లేఖ రాసారు.
వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆరు కోవిడ్ మృతదేహాలు మాయమైనట్టు ఆయన ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేసారు. అక్కడ కేసులు పెరుగుతున్నాయని ఇలాంటి చర్యలు ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని సదరు లేఖలో ఆయన వ్యాఖ్యానించారు. కాగా కేసులను దాచవద్దు అని సిఎం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.