190 ఏండ్ల తాబేలు.. మరో గిన్నిస్ రికార్డ్

ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన భూచర జంతువు జోనాథన్ (తాబేలు) మరో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. ఆ తాబేలుకు ఈ ఏడాదితో 190 ఏండ్లు నిండనున్నాయి. దీంతో జోనాథన్ అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన తాబేలుగా రికార్డు సృష్టించనున్నది.

జోనాథన్ శీతాకాలంలో బాగా కదులుతున్నది. మేత కూడా బాగానే మేస్తున్నది. కానీ, తన ముందు ఉంచిన ఆహారాన్ని మాత్రం అది గుర్తించలేకపోతున్నదని వెటర్నరీ వైద్యులు తెలిపారు.

కెలోరీలు, విటమిన్లు, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ పెంచడం కోసం వారంలో ఒక్కసారి జోనాథన్‌కు వెటర్నరీ అధికారులు చేతితో ఆహారం అందిస్తున్నారు. జోనాథన్ కంటి చూపును కోల్పోయాడు. వాసనను కూడా పసిగట్టలేడు.

జోనాథన్ వినికిడి శక్తి అద్భుతమైంది. మానవుల సహవాసాన్ని ఇష్టపడుతాడు. ఆహారం తినడం కోసం ఆహ్వానించినప్పుడు బాగా స్పందిస్తాడు అని వెటర్నీరీ అధికారులు తెలిపారు.