అక్టోబర్ లో ఇండియా వేదికగా వన్ డే వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో పాల్గొననున్న అన్ని టీం లు జట్టు కూర్పులు మరియు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ వరల్డ్ కప్ లో చివరి జట్లను ఐసీసీ కు పంపడానికి సెప్టెంబర్ 28వ తేదీ లాస్ట్ డేట్ గా ఉంది. కాగా ఇప్పటికే ఇంగ్లాండ్ టీం తమ వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లాండ్ యువ సంచలనం హ్యారి బ్రూక్ కు చోటు దక్కలేదు. పైగా గతంలో వన్ డే ల నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ ఇంగ్లాండ్ యాజమాన్యం అతనితో సంప్రదింపులు జరిపిన అనంతరం మళ్ళీ వన్ డే జట్టులోకి రావడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ హ్యారి బ్రూక్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడం గురించి మాట్లాడుతూ, బ్రూక్ కు ఇంకా దారులు మూసుకుపోలేదు.. సెప్టెంబర్ 28 వరకు ఛాన్స్ ఉంది.. అంటూ బ్రూక్ కు న్యూజిలాండ్ సిరీస్ లో రాణిస్తే చోటు దక్కుతుందని హింట్ ఇచ్చాడు.