Balakrishna Unstoppable: బాబాయ్ అబ్బాయ్ ‘అన్ స్టాపబుల్’ హంగామా

-

Balakrishna Unstoppable: న‌టసింహం నందమూరి బాల‌కృష్ణ ఓటీటీ వేదిక‌గా సంద‌డి చేయడానికి సిద్ద‌మైన విష‌యం తెలిసిందే. తెలుగు ఓటీటీ సంస్థ‌ ఆహాలో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు. ఇప్ప‌టికే షోకు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. సోష‌ల్ మీడియాతో ర‌చ్చ చేస్తుంది. తొలి ఎపిసోడ్ లో సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు అండ్ ఫ్యామిలీ ని అథితులుగా ఆహ్వానించిన‌ట్లు తెలుస్తుంది. వారిపై బాల‌య్య ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురించారు.

ఈ షోకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఎప్పుడో ముగిసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇటీవ‌లే విడుద‌లైంది. పేరుకు తగ్గట్టుగానే.. ఈ షో అన్ స్టాప‌బుల్ గా ఉంది. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలతో సరిపెట్టేయకుండా వివాదాస్పద ప్రశ్నలను సంధించ‌డం ఆసక్తికరంగా మారింది. నవంబర్ 4న ప్రసారం కానున్న “అన్ స్టాపబుల్” ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా .. ఈ షోకు సంబంధించిన మ‌రో అప్డేట్ ఇండ‌స్ట్రీలో హ‌ల్ చ‌ల్ అవుతుంది. నంద‌మూరి బాబ్బాయి, అబ్బాయిలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఒకే వేదిక‌పై క‌నిపించి సంద‌డి చేయ‌నున్న‌ర‌ట‌. “అన్‌స్టాపబుల్ షోలో జూనియ‌ర్ ఎన్టీఆర్ పై బాల‌య్య ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌నున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అలాగే ఈ కార్యక్రమంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా అతిథులుగా రాబోతున్నారు. మరి వీళ్లతో కలిసి బాలయ్య ఎలా సందడి చేస్తారో చూడాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version