వాము ఆకుతో రసం.. నార్మల్ రసం కంటే.. ఎంతో మంచిది..!

-

రసం మీద మనందరికి మంచి ఒపినీయన్ ఉంది.. భోజనం ఆఖరిలో..రసంతో నాలుగు ముద్దలు తింటే.. డైజెషన్ సమస్య ఉండదు అని అందరూ అనుకుంటారు. అదే పనిగా డైలీ రసం చేసుకునే వారు కూడా ఉన్నారు. జీర్ణకోశానికి వాము చాలా మంచిది. మరి అలాంటి వాము ఆకుతో రసం పెడితే.. మూములు రసం కంటే.. డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. గ్యాస్ ఉత్పత్తి చేయకుండా ఉంచడానికి, పొట్ట అంచుల వెంబడి జిగురు ఉత్పత్తి పెంచడానికి వాము ఆకు రసం చాలా బాగా యూస్ అవుతుంది. ఈరోజు మనం వాము ఆకుతో రసం ఎలా చేసుకోవాలో చూద్దాం..

వాము ఆకు రసానికి కావాల్సిన పదార్థాలు..

వాము ఆకు ఒక కప్పు
టమోటా పేస్ట్ రెండు కప్పులు
పెసరప్పు అరకప్పు
తేనె రెండు టేబుల్ స్పూన్స్
అల్లంపేస్ట్ ఒక టీ స్పూన్
నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
ధనియాలు ఒక టేబుల్ స్పూన్
మిరియాలు ఒక టీ స్పూన్
మెంతులు ఒక టీ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు మూడు
ఇంగువ పొడి కొద్దిగా
పసుపు కొద్దిగా

తయారు చేసే విధానం..

రసం పౌడర్ తయారుచేసుకోవడానికి.. పొయ్యిమీద నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని అందులో మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి. అస్సలు మాడనివ్వకండి. అవి చల్లారని తర్వాత మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోండి. ఆ తర్వాత పెసరపప్పు కడిగేసి కుక్కర్లో వేసి అందులో టమోటా రసం వేసి అందులో కొంచెం వాటర్ కలిపి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఆ తర్వాత.. పొయ్యిమీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని అందులో మీగడ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువపొడి, పసుపు వేసి దోరగా వేగిన తర్వాత.. అల్లం పేస్ట్ వేసి అందులో ముక్కలుగా కట్ చేసిన వాము ఆకు వేసి పచ్చివాసనపోయే వరకూ 4-5 నిమిషాలు దోరగా వేగనివ్వండి.

ఆ తర్వాత టమోటా రసం పోయండి. రెండు కప్పులు తీసుకున్నాం కదా.. పప్పు ఉడికించడానికి ఒక కప్పు వాడతారు. ఇక్కడ ఇంకో కప్పు రసం వేయాలనమాట. ఇవి కొంచెం మరిగాక. ముందుగా చేసుకున్న రసం పొడి, నిమ్మరసం వేసి కొద్దిగా మరిగాక.. తేనె కొద్దిగా వేయండి. ఫైనల్ గా.. టమోటా రసంలో ఉడికించిన పెసరపప్పును కూడా వేసేసి కొంచెం సేపు ఉంచి.. కొత్తిమీర చల్లేసి దింపేయండి. అంతే వాము ఆకు రసం రెడీ. మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది మంచిగా పనిచేస్తుంది. వారానికి నాలుగు సార్లు తిన్నా ఏం కాదు. అప్పుడప్పుడు మీరు కూడా ఇది ట్రే చేసుకుని తింటే.. బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి. చింతపండు రసం చేసి.. అందులో ఉప్పు, కారం వేసేసి తాగేస్తుంటారు. దానివల్ల బాడీకి ఎలాంటి పోషకాలు అందవు.. కేవలం డైజెషన్ అవుతుంది.. కానీ ఇలా వాము ఆకు రసం చేసుకుంటే.. బాడీకి బాగా మేలు జరుగుతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news