తెలంగాణ కాంగ్రెస్ కు “ప్రశాంత్ కిషోర్” తలనొప్పి!

-

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను అంటూ ఓ బ్లూప్రింట్ ను సోనియా కు సమర్పించారు.ఆలా చేసినప్పుడు ఇతర పార్టీలతో భేటీ కాకుండా ఉండాల్సింది.కానీ హైదరాబాదుకు వచ్చి రెండు రోజుల పాటు కెసిఆర్ తో చర్చలు జరిపి వెళ్లారు.ప్రశాంత్ కిషోర్ కి సంబంధించిన సంస్థ “ఐప్యాక్” టిఆర్ఎస్ తో పని చేస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారు.అంటే..కాంగ్రెస్ లో ఉంటూ టిఆర్ఎస్ కి పని చేస్తారా? అన్న సెటైర్లు ప్రారంభమయ్యాయి.పీకే కాంగ్రెస్ లో చేరినా చేరకపోయినా..తెలంగాణలో చేసేదేమీ లేదని..తమ పోరాటం తమ వ్యూహాలు..అమలు చేసుకుంటామని..జాతీయ రాజకీయాల్లో పీకే ఏం చేయాలి..ఏం చేస్తాడు అనేది హైకమాండ్ చూసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

అయితే పీకే కెసిఆర్ తో భేటీ కావడం వల్ల రెండు పార్టీల మధ్య పొత్తు కలుపుతారనే ప్రచారాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారు.ఇది కాంగ్రెస్ నేతలకు మరింత ఇబ్బందికరంగా మారింది.నిజానికి పీకే తెలంగాణలో..కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని రిపోర్టు ఇచ్చారు.ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.అయితే కేసీఆర్ బీజేపీ కన్నా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారన్న ఓ ప్రచారాన్ని మాత్రం ప్రజల్లో నమ్మించగలిగేలా ప్రారంభిస్తే అది కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరుగుతుంది.అందుకే టీ-కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారు.అటు పీకే ను విమర్శించే లేక, ఇటు కేసీఆర్ తో పీకే భేటీని సమర్ధించ లేక తంటాలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news