జూలై 12 రాశిఫలాలు : ఈరాశి వారికి అనుకూలమైన గాలితో ఆకస్మిక లాభాలు !

1042

మేషరాశి : ఈ సాయంత్రాన్ని మీ పిల్లలు ఉత్తేజితం చేస్తారు. వారితోగడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. మీకు తెలిసిన వారిద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్‌లు, ప్లాన్‌ల గురించి చెప్పడానికిది మంచి సమయం. వేరేవారి జోక్యం వలన, మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతాయి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టవచ్చు.
పరిహారాలు: పక్షులకు ఏడు రకాల ధాన్యాలు ఆహారం వేయడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది.

వృషభరాశి : వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. రొమాన్స్‌కి ఈరోజు అవకాశం లేదు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసి ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.
పరిహారాలు: ప్రేమ జీవితం మెరుగుపడటానికి అక్కచెల్లలను గౌరవించండి.

July 12th Friday daily Horoscope

మిథునరాశి : ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దకండి. వారికి అర్థమయేలా చెప్పండి. మీ రొమాంటిక్ మూడ్‌లో అకస్మిక మార్పు వలన మీరు అప్ సెట్ అవుతారు. పూజలు, వ్రతాల వంటి పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహిచే అవకాశం ఉంది. ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది.
పరిహారాలు: తెలుపు దుస్తులు ధరించండి, తెల్లపూలతో పూజ మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకరాశి : మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్‌కి కట్టుబడి ఉండండి. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొండి. జాగ్రత్తగా మసులుకోవలసిన రోజు. మీ మేధకే పదును పెట్టవలసినరోజు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.
పరిహారాలు: దగ్గర్లోని దేవాలయంలో బియ్యన్ని ఇవ్వండి.మీ ఆర్థికస్థితి మెరుగుపడుతుంది.

సింహరాశి : మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. ఒక సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్‌లు వాయిదా పడే అవకాశం ఉంది. కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఈరోజు మీరు, మీ జీవిత భాగస్వామి ప్రేమలో, శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు..
పరిహారాలు: ఇంట్లో పసుపు గణపతిని ఆరాధించండి తప్పక అన్నింటా జయం కలుగుతుంది.

READ ALSO  మే 29 రాశిఫలాలు : హనుమాన్ నామస్మరణ చేస్తే ఈ రాశులకు సర్వకార్యజయం!

కన్యారాశి : కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. ఖర్చులను అదుపు చేసుకోండి. ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారంకోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి కారణమవుతుంది. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురిఅవుతుంది. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
పరిహారాలు: తులసీదళాలతో వేంకటేశ్వరస్వామికి అర్చన చేయండి తప్పక అన్నింటా శుభం కలుగుతుంది.

తులారాశి : కొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచిరోజు. పాత స్నేహితులు సహాయపడుతారు. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. ఈరాశి గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
పరిహారాలు: ఈ రోజు ప్రాతఃకాలంలో సూర్యారాధన, నమస్కారాలు చేయండి, మంచి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది.

వృశ్చికరాశి : మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగ చేస్తాయి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుస్తాయి. మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తోంది. కానీ ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.
పరిహారాలు: ఆనందం, ఆర్థికంగా బాగా ఉండటానికి ఈ రోజు నవగ్రహాల దగ్గర పండ్లు పట్టుకుని ప్రదక్షిణలు చేయండి.

ధనస్సురాశి : సహోద్యోగులు, కింది ఉద్యోగులు మీకు ఆందోళన, వత్తిడులకు కారణమౌతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్, మ్యూచ్యువల్ ఫ్‌ండ్ల లో మదుపు చేయాలి. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచిరోజు కాగలదు. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. మీ బెటర్ హాఫ్‌ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.
పరిహారాలు: కుటుంబ జీవితం సాఫీగా గడవడానికి శుక్రగ్రహాన్ని ఆరాధించండి, తెల్లని దుస్తులు ధరించండి మంచి జరుగుతుంది.

READ ALSO  మకరరాశివారు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే దోషాలు పోతాయి! అక్టోబర్‌ 14- సోమవారం

మకరరాశి : కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు, త్వరితమైన చర్యను అవసరమౌతాయి. ఇలాంటప్పుడు అలసత చూపితే, తరువాత భారీ మూల్యం చెల్లించ వలసి వస్తుంది. మానసిక ప్రశాంతత కోసం, ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయ్యండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించే టప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి.
పరిహారాలు: మంచి వృత్తిపరమైన జీవితం కోసం ఎరుపు రంగులో ఉన్న తీపి ఆహార పదార్థాలను స్నేహితులకు పంచండి.

కుంభరాశి : మీ చదువులను ఫణంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే, అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. స్నేహితులు, మీకు సపోర్టివ్‌గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. కొంతమందికి కొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్‌లో ఉంచుతాయి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది.
పరిహారాలు: ఈ రోజు దేవాలయంలో ప్రదక్షిణలు చేసి ప్రసాదం స్వీకరించండి. తప్పక మంచి జరుగుతుంది.

మీనరాశి : కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి ఉంటుంది. మీ బరువు పై ఒక కన్ను వేసి ఉంచండి, అమితంగా తినడంలో పడిపోకండి. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించండి. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండి. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.
పరిహారాలు: ఆర్థిక అభివృద్ధి కోసం గంధాన్ని ధరించండి. తప్పక మంచి ఫలితం వస్తుంది.

– కేశవ