అచ్చు గుద్దినట్లు స్మైలింగ్ క్వీన్ త్రిషలా ఉన్న ఈ అమ్మాయి ఎవరంటే..?

-

స్మైలింగ్ క్వీన్ త్రిష..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కల్యాణ్ తో పాటు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల సరసన కథానాయికగా నటించిన ఈ భామ..మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్-1’ లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

trisha deepss.rao duplicate copy

వెండితెరపైన త్రిష..కనబడితే చాలు ఆమె అభిమానులు ఆనందపడిపోతారు. తనదైన శైలి నటనతో హీరోయిన్ గా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది త్రిష. కాగా, అచ్చుగుద్దినట్లు త్రిషను పోలి ఉన్న ఓ అమ్మాయి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు అమ్మాయి ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

‘జూనియర్ త్రిష’, మరోస్మైలింగ్ క్వీన్ త్రిష..అని కామెంట్స్ చేస్తున్నారు. అచ్చు గుద్దినట్లు త్రిష మాదిరిగానే ఉన్న ఈ అమ్మాయి ఇన్ స్టా గ్రామ్ ..లో హల్ చల్ చేస్తోంది. డీప్‌ఎస్ఎస్.రావు అనే ఇన్ స్టా అకౌంట్ లో ఈ అమ్మాయి త్రిష మాదిరిగా డ్రెస్ అయి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు, సినీ అభిమానులు ఈ అమ్మాయి మరో త్రిష అవుతుందని అంటున్నారు.

కళ్లు, ముక్కు, చెవులతో పాటు నవ్వు ..ముఖంలో కవళికలు అన్నీ కూడా అచ్చు గుద్దినట్లు త్రిషను పోలి ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్రిష నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘96’లో మాదిరిగా ఈ అమ్మాయి ..పసుపు రంగు పంజాబీ డ్రెస్సు, నీలం రంగు చున్నీ ధరించిన ఫొటోను చూసి నెటిజన్లు ‘క్రేజీ గర్ల్..త్రిష’ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news