తెలంగాణ రాజకీయాలు ఇప్పుడిప్పుడే చాలా హాట్ హాట్ గా మారుతున్నాయి. ఈ మధ్యనే అధికార పార్టీ BRS నుండి జూపల్లి మరియు పొంగులేటి లు బయటకు వచ్చేశారు. కాగా అప్పటి నుండి వీరిద్దరో కేసీఆర్ పతనం కోసం పనిచేస్తున్నారు. తాజాగా జూపల్లి కృష్ణారావు రైతుల సమస్యల కోసం బాధ్యత తీసుకుని వారికి అన్ని విధాలుగా న్యాయం చేయడం కోసం ఈ రోజు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద నిరసన చేయడానికి పూనుకున్నారు. అయితే మధ్యలోనే పోలీసులు జూపల్లి కృష్ణారావు ను అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారు. ఈ విషయం పట్ల జూపల్లి కృష్ణారావుకు మద్దతుగా ఉన్న ప్రజలు మరియు అనుచరులు పోలీసులు చేసింది సరైనది కాదని ప్రధాన రహదారిపై బైఠాయించారు.
కాగా బైక్ లను కూడా తగలబెడుతూ పరిస్థితిని మరింత ఉత్కంఠగా మెరుస్తుంటే రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అందులోకి తెచ్చుకున్నారు. మరి ఈ సమస్య ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.