విశ్వనటుడు కమల హాసన్ సినిమాల గురించి మరోసారి సంచలన కామెంట్ లు చేశాడు. తాజాగా కమల్ హాసన్ ఐఫా నిర్వహించిన సినీ అవార్డ్స్ ఫంక్షన్ కు వచ్చిన సందర్భంగా ఒక కీలక అంశాన్ని సభాముఖంగా అందరికీ తెలియచేశారు. మనకు తెలిసిన ప్రకారం ఇప్పుడు థియేటర్ లలో కన్నా కూడా ఓ టి టి లలో ఎక్కువగా సినిమాలు విడుదల అవ్వడం పట్ల కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇది సినిమాల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎందరినో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విషయం గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ… ఓటిటి చానెళ్లు వస్తాయని నేను గతంలోనే చెప్పానని.. అయితే ఎవ్వరూ నా మాట పట్టించుకోలేదని చెప్పాడు. ఓటిటి ల వలన నిర్మాతలకు ఆదాయాలు బాగానే వస్తున్నాయని , అందుకే చిన్న చిన్న నిర్మాతలు ఈ పద్దతిని ఎంచుకుంటారని చెప్పారు.
నేను కూడా కొన్ని చిన్న సినిమాలకు నిర్మాతగా చేస్తున్నట్లు చెప్పాడు కమల్. ఇప్పుడు ఎక్కువ మంది ఓటిటి లలోనూ సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు.