Kacha Badam Singer : మరో పాట పాడిన “కచ్చా బాదామ్‌ సింగర్‌”

-

పల్లిలు అమ్ముకునే ఒక వ్య‌క్తి.. ఒక పాట‌తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు.. అత‌నే భూబ‌న్. క‌చ్చా బాదామ్ అనే పాట‌తో భూబ‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. గ‌ల్లిల్లో పాడిన పాట నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని న‌గ‌రాల్లో వినిపిస్తోంది. దీంతో అత‌ని జీవితం రూపు రేఖ‌లు మారిపోయాయి. ఒక పెద్ద సెల‌బ్రెటీ అయిపోయాడు.

అయితే ఈ క‌చ్చా బాదామ్ సింగ‌ర్ భూబ‌న్ కు ఇటీవలే రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కారు ప్ర‌మాదంలో భూబ‌న్ ఛాతిలో బ‌ల‌మైన గాయం అయింది. దాదాపు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. బాదామ్‌ సింగర్‌ డిశ్చార్జ అయ్యారు.

అయితే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే కారు యాక్సిడెంట్‌ మీదనే భుజన్‌ మరో పాట అందుకున్నారు. అమర్‌ నోటున్‌ గారి ”నా కొత్త కారు” అంటూ భుజన్‌ పాడిన పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కచ్చా బాదమ్‌ ఫీవర్‌ పోకముందే మరో పాటను భుజన్‌ పాడటంతో నెటిజన్లు ఫుల్‌ ఫిదా అవుతున్నారు. ఆ పాటకు కూడా స్టెప్స్‌ వేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు నెజిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news