నిన్న ఢిల్లీ లో జరిగిన శ్రీలంక మరియు బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఒక వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక మ్యాథ్యూస్ బంతిని ఎదుర్కోవడం ఆలస్యం అయిందన్న కారణంతో బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ చేసిన టైం అవుట్ అప్పీల్ కింద అంపైర్ అవుట్ గా ప్రకటించి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియా వేదికగా వివాదంగా మారింది. ఈ వివాదంపై తాజాగా మహమ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఏడాది జనవరిలో శ్రీలంక మరియు ఇండియా ల మధ్య జరిగిన మ్యాచ్ లో దాసున్ శనక సెంచరీ కి దగ్గరగా ఉన్న సమయంలో ఏ విధంగా షమీ అతన్ని మాన్కడింగ్ విధానంలో అవుట్ చేశాడో ? మళ్ళీ ఆ అవుట్ ని కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ వెనక్కు తీసుకున్నాడో అని ఒక ఉదాహరణగా తెలియచేసే ప్రయత్నం చేశాడు.
షకీబ్ రోహిత్ ను చూసి అయినా నేర్చుకో అంటూ కామెంట్ చేస్తున్నారు. రోహిత్ చేసింది క్రీడా స్ఫూర్తి అండ్ నిజమైన నాయకత్వం అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కు స్పందన వస్తోంది.