అందాల చందమామ కాజల్ అగర్వాల్ శుక్రవారం తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఎంతో కాలంగా ఈ ఉద్విగ్న క్షణాల కోసం ఎదురుచూసిన కాజల్ అగర్వాల్ తన్మయత్వంలో పులకించిపోయింది. కోరిన వరుడు తన జీవితంలోకి రావడంతో ఆనందం పట్టలేక పరవశించిపోయింది.
పెళ్లైన తరువాత వరుడు గౌతమ్ కిచ్లూ రైట్ హ్యాండ్‌ని ముద్దుల్లో ముంచేస్తూ మురిసిపోయింది. ఆ ఫొటోని తన ఇన్ స్టా పేజ్‌లో షేర్ చేసింది. దానికి ఆసక్తికరమైన కామెంట్‌ని కూడా జత చేసింది. నా సోల్‌మేట్‌ని వివాహం చేసుకున్నాను. మిస్ నుంచి మిసెస్‌గా మారిన క్రమంలో నా తోడుని, నా కాన్ఫిడెంట్‌ని, నా బెస్ట్ ఫ్రెండ్‌ని తెలుసుకున్నందుకు ఆనందంగా వుంది.
జీలకర్ర బెల్లం కు సంబంధించిన ఫొటోని షేర్ చేసిన కాజల్ పంజాబీ, కశ్మీరీ వివాహంలో జీలకర్ర బెల్లం వుండదు కానీ దక్షిణాదిపై తనకున్నసంబంధాలకు గుర్తుగా దక్షిణాదికి తనిస్తున్న నివాళిగా పేర్కొంది. కాజల్ గౌతమ్‌కు ముద్దిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CHAzbXvHY-l/?utm_source=ig_web_copy_link