ఏపీలో భారీ ప్లాస్మా మోసం…!

-

కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే ప్లాస్మా విషయంలో ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయి. నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో భారీగా ప్లాస్మా కుంభకోణం జరిగింది. నిర్వాహకుల్లో ఒకరిద్దరు బయట వ్యక్తులతో కలిసి మాఫియాగా ఏర్పడి రూ.లక్షల్లో దోపిడి చేస్తున్నారు. చెన్నైలోని ఒకే ఒక్క కామాక్షి హాస్పిటల్ కి భారీ సంఖ్యలో ప్లాస్మా తరలిస్తున్నారు. చనిపోయిన రోగుల పేర్లుతోనూ ప్లాస్మా యూనిట్లు పక్కదారి పట్టిస్తున్నారు అని గుర్తించారు.

ఒకే రోగి పేరుతో వెంటవెంటనే ప్లాస్మా తీసుకున్నారు. రిసెప్షనిస్టు పేరుతోనే ఏడెనిమిది యూనిట్లు ఉన్నాయి. పేరూ ఊరూ లేకుండానే నలభై యూనిట్లు ఉన్నాయి. 470 మంది కరోనా రోగులకి ప్లాస్మా ఇవ్వగా, వంద మందికి పైగా మృతి చెందరు అని అధికారులు గుర్తించారు. దాతలకి గౌరవంగా ఇచ్చే రూ. 5 వేలను కూడా మోసం చేసి తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news