టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే అటు తండ్రితో ఇటు అబ్బాయితో కలిసి నటించిన ఏకైక హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కాజల్ ఇక వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ముంబై కు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత కొడుకు పుట్టడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. ఇకపోతే త్వరలోనే మళ్లీ రీయంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కి భారీగా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఇక ఎలాగో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాల్సిన భారతీయుడు 2 సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక కాజల్ అగర్వాల్ సెప్టెంబర్ 13 నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటించిన చిత్రం ఆచార్య లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాల్సి ఉంది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఆమె పాత్రను దర్శక నిర్మాతలు తొలగించేశారు.
అంతేకాదు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించబోతున్న భారతీయుడు 2 సినిమా నుంచి కూడా ఈమెను తప్పించాలని అనుకున్నారు. కానీ ఆమె పాత్రను తానే పోషించనున్నట్లుగా ఇంస్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది కాజల్. ఇక ఈ సినిమా మంచి హిట్ అయితే కాజల్ అగర్వాల్ కి మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.కాజల్ అగర్వాల్ కి ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ ముందులాగా తన ఫేస్ లేదని కొంతమంది చెబుతున్నారు ఇక తన ఫేస్ కు ఫేస్ సర్జరీ చేయించుకుంటే వికటిస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది . ఉబ్బిపోయిన బుగ్గలతో కొంచెం అందవిహీనంగానే తయారయింది కాజల్ అగర్వాల్.