తెలంగాణలో ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను చేపట్టారు. ఈ మేరకు పరీక్షలు కూడా జరుగుతున్నాయి.ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జరగుతున్న విషయం తెలిసిందే..ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 93937 11110/93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇంకా.. [email protected] కు వివరాలు పంపి పరిష్కారం పొందొచ్చు.
దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఇందు కోసం గ్రేటర్ పరిధిలో 503 ఎగ్జామ్ సెంటర్లు, రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రిలిమ్స్ పరీక్షలో ఈ సారి నెగెటివ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తప్పు సమాధానానికి 0.25 మార్కులను కోల్పోతారు. దీంతో అభ్యర్థుల్లో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. 60 మార్కులు సాధించిన వారికి మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్స్ కు ఎంట్రీ ఉంటుంది.
ఇక విషయానికొస్తే..మొదట 100 మార్కులకు రీజనింగ్ అండ్ అరిథమేటిక్ లో ప్రశ్నలు ఇస్తారు. మిగతా 100 మార్కులకు కరెంట్ అఫైర్స్ తో పాటు.. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలును అడుగుతారు. అయితే పరీక్ష హాల్లోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రీజనింగ్ పార్ట్ చేస్తే.. టైమ్ తీసుకున్నా ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఒక గంట వరకు రీజనింగ్ పార్ట్ కు.. సమయం కేటాయించిన తర్వాత ఒకసారి పేపర్ అంతా ఒక్కసారి చదువుకుంటూ వెళ్లాలి. వచ్చిన బిట్స్ ను బబుల్ చేసుకుంటూ వెళ్లాలి. మిగిలిన సమయాన్ని మ్యాథ్స్ బిట్స్ చేసుకుంటూ వెళ్లాలి..ఇలా కరెక్ట్ అయిన పరీక్షలను బబుల్ చేసి కౌంట్ చెయ్యాలి..
నెగెటివ్ మార్కలు పోయినా.. కనీసం 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 50 నుంచి 60 మార్కుల మధ్యలో స్కోర్ వస్తుందంటే.. జగ్రత్తగా ఉండాలి. ఒక ప్రశ్నకు రెండు సమాధానాలు అనిపిస్తున్న వాటికి ధైర్యం చేసి.. ఏదో ఒక సమాధానాన్ని గర్తించడం మంచిది. ఇలా చేస్తే మార్కులు కలిసే అవకాశం ఉంటుంది. 60 నుంచి 70 మార్కులు పక్కా కరెక్ట్ అనిపిస్తే.. వేరే ప్రశ్నల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. చివరకు రీజనింగ్ బిట్స్ సింపుల్ గా ఉంటాయి కావునా.. వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టండి 50 మార్కులకు 40 మర్కులకు పైగా స్కోర్ సాధించవచ్చు. మిగతా 20 మార్కులకు కరెంట్ అఫైర్స్, తెలంగాణ బిట్స్ కు సంబంధించి మీ అవగాహన మేర గుర్తిస్తే 60 మార్కులను సులువుగా పొందవచ్చు.ఇది గుర్తుంచుకోండి…ఈరోజు జరుగుతున్న ఎగ్జామ్స్ లో మంచి మార్కులను స్కొర్ చెయ్యవచ్చు..ఆల్ ది బెస్ట్..