కాజ‌ల్ ల‌వ్ మ్యారేజ్ అక్టోబ‌ర్ 30నే!

-

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో వున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పుష్క‌ర కాలంగా త‌న చ‌రిష్మాతో స‌త్తా చాటుతోంది. క్రేజీ హీరోయిన్‌గా స్ట‌ర్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న ఈ అందాల చంద‌మామ ఆ క్రేజ్‌ని అలాగే కంటిన్యూ చేస్తోంది. వ‌రుస క్రేజీ చిత్రాల్లో ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం హాలీవుడ్ మేక‌ర్స్ రూపొందిస్తున్న `మోస‌గాళ్లు` , ముంబై సాగా వంటి చిత్రాలతో పాటు ఇండియ‌న్ 2, ఆచార్య సినిమాల్లో న‌టిస్తోంది.

కెరీర్ ప‌రంగా బిజీగా వున్న కాజ‌ల్ ప్రేమ ప‌రంగానూ బిజీగానే వున్న‌ట్టు క‌నిపిస్తోంది. కెరీర్ మాంచి జోరులో వుండ‌గానే పెళ్లి పీట‌లెక్కాల‌నే ఆలోచ‌న‌లో కాజ‌ల్ వున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఓ బిజినెస్‌మెన్‌తో కాజ‌ల్ ఎంగేజ్‌మెంట్ అయింద‌ని వార్త‌లు షికారు చేశాయి. తాజాగా ఇంటీరియ‌ర్ బిజినెస్‌మెన్ గౌత‌మ్ కుచ్లూ తో కాజ‌ల్ గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వుంద‌ని, త్వ‌ర‌లోనే ఇద్దరు వివాహం చేసుకోబోతున్నార‌ని, వీరి పెళ్లికి కాజ‌ల్ ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి ఈ వార్త‌లు నిజ‌మేన‌ని, తాను ప్రేమ‌లో వున్నాన‌ని గౌత‌మ్ క‌చ్లూని వివాహం చేసుకోబోతున్నాన‌ని, ఈ విష‌యం చెప్ప‌డానికి చాలా ఆనందిస్తున్నాన‌ని వెల్ల‌డించింది.

అక్టోబ‌ర్ 30న మా పెళ్లి ముంబైలో అత్యంత స‌న్నిహిత‌లు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌ర‌గ‌నుంద‌ని కాజ‌ల్ వెల్ల‌డించింది. కొత్త జీవితాన్ని ప్రారంభించ‌బోతున్నందుకు ఇద్ద‌రం చాలా థ్రిల్ అవుతున్నామ‌ని నాపై ఇన్నేళ్లుగా అభిమానాన్ని కురిపిస్తున్న ప్ర‌తీ ఒక్క‌రి ఆశీర్వాదం మాకు కావాల‌ని కాజ‌ల్ ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news