అందాల చందమామ కాజల్ అగర్వాల్ గతేడాది వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కిచ్లు కాజల్ కు చిన్న నాటి స్నేహితుడు కావడం తో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. యూత్ గత కొద్దిరోజులుగా కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజం అయ్యాయి. 2022 లో కాజల్ కిచ్లు దంపతులు మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు.
ఈ విషయాన్ని గౌతమ్ కిచ్ లు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “2022 లో నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం” అంటూ ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే కాజల్ సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి తరవాత కూడా సినిమాలు చేసిన కాజల్ సినిమాలకు నో చెప్పడం వల్ల అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలు నిజం అయ్యాయి.