Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కు ఊహించని షాక్ తగిలింది. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్టు అయ్యాడు. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని బెంగుళూరులో అరెస్టు చేసి నెల్లూరుకు తరలించారు పోలీసులు. ఇక ఇవాళ వెంకటగిరి కోర్టులో కాకాణిని హాజరుపర్చనున్నారు పోలీసులు.

మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్ కావడం పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్ లతో వైసీపీని అణగదొక్కాలంటే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదని వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై జిల్లా పోలీస్ ప్రకటన చేయాలన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు.