చంద్రబాబు ఆరోగ్యంపై కళా వెంకట్రావ్‌ కీలక వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ఇవాళ కుటుంబ సభ్యులు కలిశారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి రాజమండ్రి జైలులో చంద్రబాబును ములాఖత్ లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు వద్దకు టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప తదితరులు కూడా వచ్చారు.

Rumours again on Kala Venkat Rao quitting TDP

చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ అనంతరం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. వీళ్లిచ్చే మందులతో ఆయనకు ఏమీ ఉపశమనం లేదని తెలుస్తోందని వివరించారు. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షల వివరాలను, డాక్టర్ల సిఫారసుల తాలూకు నివేదికకు సంబంధించిన ఓ కాపీని చంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని తాము నిన్న టీడీపీ ఆఫీసు నుంచి డిమాండ్ చేశామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. దీనిపై నారా భువనేశ్వరమ్మ ఒక లేఖ కూడా రాశారని తెలిపారు.

ఎప్పటికప్పుడు నివేదిక కాపీని ఇవ్వడం వల్ల చంద్రబాబు బ్లడ్ లెవల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుందని అన్నారు. చంద్రబాబుకు హైదరాబాదులో, విజయవాడలో వ్యక్తిగత వైద్య బృందాలు ఉన్నాయని, నివేదిక కాపీని వారికి పంపిస్తే చంద్రబాబు వాడే మందుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలేమో సూచిస్తారన్నది చంద్రబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయం అని కళా వెంకట్రావు వివరించారు.

“చంద్రబాబు వైద్య నివేదికలు ఎందుకు ఇవ్వడంలేదు? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? జగన్ రాక్షస క్రీడకు తెరలేపారు. ఇలాంటివాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. కానీ జగన్ హయాంలో దీనికి అంతం కనిపించడంలేదు. 40 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి, ఇప్పటివరకు ఏ కోర్టులోనూ లిఖితపూర్వక ఆధారాలు చూపించలేకపోయారు. రాష్ట్రంలో ఇలాంటి నికృష్ట ప్రభుత్వం ఉంది. నువ్వు (జగన్) చేయగలిగింది ఏంటంటే… రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి రాక్షస క్రీడ కొనసాగిస్తున్నావు. మానవత్వం లేకుండా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న పరిమితులు కూడా దాటిపోయి వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news