కలియుగం ముగిసింది.. సత్యయుగం ప్రారంభమైంది: పద్మజ దంపతులు

Join Our Community
follow manalokam on social media

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఇద్దరు అక్కచెల్లెల హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ మొదలు పెట్టేశారు. కస్టడిలో ఉన్న తల్లిదండ్రులు పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులను పోలీసులు విచారణ జరుపుతున్నారు. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరచారి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ.. విచారణలో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు. తమ కూతుళ్లు సాయిదివ్య, అలేఖ్యలు చనిపోలేదని, వారి తిరిగి బతుకుతారని నిందితులు పేర్కొంటున్నారు.

women

ఇప్పటితో కలియుగం ముగిసిపోయిందని.. సత్యయుగం ప్రారంభమైందని అంటున్నారని తెలిపారు. రక్తాభిషేకం చేస్తే కలియుగపురుషుడు శాంతిస్తాడని.. అందుకే తమ కూతుళ్లను బలి ఇచ్చామన్నారు. అలాగే కరోనా కూడా చైనాలో పుట్టలేదని.. శివుడి వెంట్రుకల్లో పుట్టిందని వారు చెబుతున్నారని డీఎస్పీ వెల్లడించారు. పూజ చేస్తున్నప్పుడు తమ కూతుళ్ల మృతదేహాలు ఇంట్లోనే ఉన్నాయని.. మృతదేహాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడే తమ కూతుళ్లు చనిపోయారని వాళ్లు చెబుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. దంపతులిద్దరిని చూస్తే మానసిన పరిస్థితి బాలేనట్లు కనిపిస్తుందని, కేసు విచారణలోనే ఉందన్నారు.

మంత్రాల పేరుతో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్ కు చెందిన పురుషోత్తమ్ నాయుడు.. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ గా ఉన్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె బోపాల్ లో పీజీ చేస్తుండగా.. చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.

ఆగస్టులో శివనగర్ లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి దిగారు. తరచూ పూజలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబల్ తో కొట్టి హతమార్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు మదనపల్లి డీఎస్పీ రవిమనోహరా చారి, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు దిలీప్, రమాదేవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని చేపడుతున్నారు. కాగా ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం కూడా చిత్తూరు నుంచి మదనపల్లెకు బయలు దేరింది. నివాసం ఉన్న ఇంట్లో దేవుళ్లతో పాటు చిత్ర విచిత్రంగా ఉన్న ఫోటోలను గమనించారు. నిందితుల మానసిక పరిస్థితి మెరుగ్గా లేదని.. వైద్యుల సలహా మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...