మైండ్‌బ్లాక్‌: క‌ల్కి భ‌గ‌వాన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా…

-

కలియుగ ప్రత్యక్ష దేవుడిగా తనకు తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్ పై ఐటీ దాడుల్లో మ‌తిపోయే నిజాలు ఒక్కొక్క‌టిగా వెల్ల‌డి అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన దాడుల్లో ఏకంగా రు.500 కోట్ల ఆస్తులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా త‌మిళ‌నాడుకు చెందిన ఐటీ అధికారులు క‌ల్కి భ‌గ‌వాన్ ఆశ్ర‌మంతో పాటు త‌మిళ‌నాడు, తెలంగాణ‌, క‌ర్నాక‌ట‌తో పాటు భ‌గ‌వాన్ ఆస్తులు ఉన్న ప‌లు ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రిపారు.

ఇక చిత్తూరు జిల్లాలోని వరదాయపాలెంలో సోదాల్లో కట్టల పాములు వెలుగుచూశాయి.. కట్టల కొద్దీ నగదు, కోట్లు విలువైన బంగారంతో పాటు న‌గ‌లు, వ‌జ్రాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో ఐటీ అధికారులు సైతం షాక్ అయ్యారు. ఐటీ దాడుల్లో రు. 43.9 కోట్ల భార‌త క‌రెన్సీతో పాటు రు. 18 కోట్లు విలువైన అమెరికన్ డాలర్లు… 26 కోట్ల విలువైన 88 కిలోల బంగారం 5 కోట్ల విలువైన వజ్రాలు బయటపడడం కలకలం రేపింది.

క‌ల్కి పూర్వాప‌రాల్లోకి వెళితే విజయ్‌కుమార్ (70) గ‌తంలో ఎల్ఐసీలో క్ల‌ర్క్‌గా ఉండేవాడు ఆ త‌ర్వాత 1980లో జీవాశ్రమం పేరిట పాఠ‌శాల పెట్టి త‌న‌ను తాను కల్కి భగవాన్‌గా ప్రకటించుకున్నాడు. తన భార్య కుమారుడితో కలిసి ట్రస్ట్ పెట్టి ఇలా అశ్రమాలతో దందాలు చేస్తున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఇక క‌ల్కి, ఆయ‌న కుమారుడు రియ‌ల్ ఎస్టేట్, నిర్మాణాలతో పాటు అమెరికా, దుబాయ్‌, యూఏఈ లాంటి చోట్ల భారీగా పెట్టుబ‌డులు పెట్టి వ్యాపారాలు చేస్తున్న‌ట్టు వెల్ల‌డైంది.

2014 నుంచి ఇప్ప‌టికే రు.409 కోట్ల అక్ర‌మ ఆదాయం గుర్తించ‌గా… అన‌ధికారికంగా దీని ఆదాయం కొన్ని వేల కోట్ల‌లో ఉంటుంద‌ని స‌మాచారం. ఇక క‌ల్కి భ‌గ‌వాన్‌పై కేసు నమోదు చేసిన ఐటీ అధికారులు ఆ కేసులో ఆయనను ‘ ఏకత్వ సిద్ధాంత గురువు ’గా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news