కష్టే ఫలి.. ఈ పదం పెద్దవాళ్లు ఎక్కువగా వాడుతుంటారు.. జీవితంలో పైకి రావాలంటే పెద్దల మాట తప్పక వినాలి.. అంతేకాదు విజయం దక్కేవరకు పోరాడాలి.. ఎవరికి విజయం వెంటనే రాదు.. అందుకోసం బాగా కష్ట పడాలి.. అయితే జీవితంలో పైకి ఎదగాలంటే ఈ మూడు సూత్రాలను పాటించాలని చాణిక్య నీతి చెబుతుంది.. ఆ మూడు సూత్రాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవేత్తగా, వ్యూహకర్తగా, రాజ సలహాదారుగా ఇలా అనేక రంగాలలో అత్యుత్తమంగా చాణిక్యుడు నిలిచారు.. మహా మేధావి.. నీతిశాస్త్రం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశారు. ఆయన బోధనలను ఆచరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా విజయం పొందుతారు.. ఆయన చెప్పిన మూడు సూత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం..
బాగా కష్టపడటం…
ఏది ఊరికే రాదు.. దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది.. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ భయపడకండి. లక్ష్యం దిశగా ముందడుగు వేస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. వరుస వైఫల్యాలతో మీరు నిరాశ చెందవచ్చు.. దుఃఖం వదిలితే ఆలోనలు వస్తాయి.. వాటిని ఆచరణలో పెట్టడం మాత్రమే కాదు.. ఒకటికి పది సార్లు కష్టపడాలి..
నిజాయితి..
అపద్దపు ప్రయత్నాలతో మోసం చేసుకోకూడదు.. ఏదైన నిజాయితీగా ఉండాలి.. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పుడు మొహమాట పడకుండా అందరినీ కలుపుకుపోవాలి. లక్ష్యానికి అవసరమైన సంపూర్ణమైన సమాచారం ముందుగా సిద్ధం చేసుకోవాలి… అప్పుడే జీవితంలో పైకి వస్తారు..
ప్రణాళిక..
ఒక పని మొదలు పెట్టేముందే ప్రణాళిక వేసుకోవాలి.. మీ ప్రణాళికను ఒక మంత్రంలా రహస్యంగా ఉంచాలి, పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. మీరు మీ ప్రణాళికను ఎంత రహస్యంగా ఉంచుకుంటే, మీరు అంత సులభంగా విజయం సాధిస్తారు.. మీరు వేసుకొనే ప్రణాళిక పై మీకు క్లారిటీ ఉంటే మాత్రం పైకి వస్తారని చెబుతున్నారు.. ఏది గొప్పలకు పోయి చెప్పుకోకూడదు.. ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి..