Kalki: ‘కల్కి’ తెలుగు ప్రోమో విడుదల

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇటీవల ‘కల్కి’ నుంచి విడుదలైన అమితాబ్ అశ్వత్థామ ప్రోమోకు విపరీతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చిత్రయూనిట్ తాజాగా తెలుగు ప్రోమోను విడుదల చేసింది. ‘ద్వాపరయుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా.. ద్రోణాచార్యుడి పుత్రుడిని, నా పేరు అశ్వత్థామ’ అని అమితాబ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే గ్లింప్స్ అమితాబ్ యంగ్ లుక్కు ప్రశంసలు వెల్లువెత్తాయి.ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news