నాలుగు నెలలుగా ఏ ఒక్క వర్గమైనా నీ వల్ల బాగుపడిందా రేవంత్ రెడ్డి? : రావుల శ్రీధర్‌రెడ్డి

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ .. హామీలు నేరవేర్చాలనే సోయి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు.తెలంగాణ భవన్ లో ఆయన విలేకరుల సమావేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలో ఇచ్చిన వాగ్దానలు కొండంత అని.. కాంగ్రెస్ 420 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాలుగు నెలలుగా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్ని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.

మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని.. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ,ప్రత్యేకంగా 12 హామీలు ఇచ్చారని.. ఇందులో వాటిలో అమలు చేసింది ఎన్ని అని ఆయన నిలదీశారు. మైనారిటీల ఉపాధి కల్పనకు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారని.. ఇమామ్‌లు, మౌజాన్‌లు, పాస్టర్లందరికీ రూ.10వేల నుంచి రూ.12వేల వరకు గౌరవ వేతనం ఇస్తామన్నారని.. హామీలు నేరవేర్చాలనే సోయి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు నెలలుగా ఏ ఒక్క వర్గమైనా నీ వల్ల బాగుపడిందా? అంటూ మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news