జగన్ ఇక బ్యాండేజ్ తీసేస్తే బెటర్ : వైఎస్ సునీతా

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడిపై రాష్ట్రంలో ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి విచారిస్తుండగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది.ఈ క్రమంలో వివేకా కూతురు సునీత ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇక బ్యాండేజ్ తీసేస్తే బెటర్ అని, ఎక్కువ రోజులు బ్యాండేజ్ ఉంటే గాయం సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని, ఒక డాక్టర్ గా సలహా ఇస్తున్నాని ఆమె ఎద్దేవా చేశారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందని సెటైర్స్ వేశారు సునీత.

పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందని, వివేకా ఏం పాపం చేశారని జగన్ కు అంత ద్వేషం అని ఆమె ప్రశ్నించారు. మీకోసం త్యాగం చేశారు కాబట్టే వివేకాపై కోపమా అని అన్నారు. జగన్ కు కోర్టులు,సీబీఐ మీద నమ్మకం లేదని, తనకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉందో చెప్పాలని అన్నారు. సీబీఐ నిందితులని పేర్కొన్న వాళ్ళను జగన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సునీత

Read more RELATED
Recommended to you

Latest news