తెరాస మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ సెకండరీ స్కూల్ (ఎస్జెఎస్ఎస్)లో తన వంతు సహాయం చేసారు. కరోనా మహమ్మారి సమయంలో నిరంతర అభ్యాసం ఉండేలా ఉపాధ్యాయుల కోసం కంప్యూటర్ల కోసం మరికా ఇసాబెల్, మేరీ గాబ్రియేల్ విజ్ఞప్తి చేసారు. దీనికి కవిత వేగంగా స్పందిస్తూ ప్రిన్సిపాల్ బ్యూలా గాబ్రియేల్ మరియు పాఠశాల సిబ్బంది సమక్షంలో పాఠశాలకు తొమ్మిది డెస్క్ టాప్‌లను అందించారు.
వారి భవిష్యత్ ప్రయత్నాలకు గాను కవిత వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాఠశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. సెయింట్ జోసెఫ్ సెకండరీ స్కూల్ నిర్వహణ మరియు సిబ్బంది కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల సామాజిక సేవల విషయంలో ఆమె ముందు ఉన్నారు. గత ఏడాది నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఆమె ఓటమి పాలైన సంగతి తెలిసిందే.