తెలంగాణ రాజకీయాలన్నీ ఈటల రాజేందర్‌చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీలూ ఆయన విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. మాకంటే మాకు అన్నట్టు ఆయన్ను లాగేసుకోవడానికి అన్ని పార్టీలూ వథ విధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరతారనేది మొన్నటి వరకు కొంత అనుమానంగా ఉండేది. కానీ ఇప్పుడు దీనిపై కాస్త క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటాని తెలుస్తోంది. కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నేతలైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీలోకి వచ్చేందుక సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇదే విషయమై ఈటల తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. బీజేపీ అగ్రనేత అమిత్ షా కడూఆ ఈటలను సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించినట్టు చర్చ జరుగుతోంది. గురువారం బీజేపీ చీఫ్ నడ్డాతోనూ ఈటల చర్చలు జరిపి కన్ఫర్మ్ చేయడమే మిగిలిపోయింది. నడ్డాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత కండువా కప్పుకుంటారని సమాచారం. అయితే కమ్యూనిస్టుగా తన జీవితాన్ని మొదలు పెట్టిన ఇప్పుడు భిన్నమైన బీజేపీలో ఏ మేరకు కొనసాగుతారో చూడాలి.